ఏపీ మంత్రులకు హీరో సిద్ధార్థ్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరు అంతా అవినీతిపరులే !!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను పెంచాలంటూ మొదటినుంచి టాలీవుడ్ పెద్దలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు హీరో నాని. కిరాణా షాప్ కలెక్షన్ల కంటే థియేటర్ల కలెక్షన్లు తక్కువ అయిపోయాయి అంటూ… నాని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అయితే నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ నిప్పులు చెరిగారు. “సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్లంతా… ప్రభుత్వానికి లెక్కలతో సహా టాక్ లు కడుతున్నాం. రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి టాక్స్ లు లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. ప్రజల డబ్బును అన్యాయంగా దోచుకుంటున్నారు. అవినీతి చేసి సంపాదించుకుంటున్నారు. కానీ మేము అలా కాదు. మీ విలాసాలను తగ్గించుకోనీ.. మాకు సబ్సిడీలు ఇవ్వండి” అంటూ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version