ఈ కాలంలో విడాకులు అనేవి కామన్..హీరో సుమంత్ సంచలనం

-

టాలీవుడ్‌ హీరో సుమంత్‌ గురించి తెలియని వారుండరు. అయితే.. హీరో సుమంత్‌.. కొన్ని రోజుల క్రితమే విడాకులు తీసుకున్నాడు. నటి కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్‌… కొన్ని సంవత్సరాలకే వారు విడి పోయారు. ఆ తరువాత హీరోయిన్‌ కీర్తి రెడ్డి.. రెండో పెళ్లి చేసుకుని బాగా సెటిల్‌ కూడా అయింది. కానీ హీరో సుమంత్‌ మాత్రం ఇప్పుడు సింగిల్‌ గానే ఉంటున్నారు.

అయితే.. తాజాగా హీరో సుమంత్‌.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సమాజంలో విడాకులు తీసుకోవడం చాలా సర్వ సాధారణమై పోయాయని చెప్పారు.

”నాకు తెలిసిన చాలామంది విడాకులు తీసుకున్నారు. నా ఫ్యామిలీ లో కూడా విడాకులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు విడాకులు అనేది ఇప్పుడు కామన్‌ అయిపోయింది. ఈ విషయంలో.. నేను దుర దృష్టం అనే పదం కూడా వాడదలుచుకోలేదు. అలా జరుగుతన్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ.. అడ్జెస్ట్‌ అయిపోతున్నారు” అంటూ సుమంత్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సుమంత్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version