అతడి మద్దత్తు ఎవరికో చెప్పిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ..!?

-

బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్నా షో బిగ్ బాస్. ఇక బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ముగిసేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ షోకి నాగార్జున వ్యాఖ్య‌త‌గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ 4 ఈ వారాంతంలో ముగియ‌నుంది. ప్ర‌తి సీజ‌న్‌లాగే ఈ సీజ‌న్ ‌కి గ్రాండ్ ముగింపు ఇచ్చేందుకు నిర్వాహ‌కులు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు చివ‌రి రోజున బిగ్‌బాస్ స్టేజ్‌పై సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం హౌజ్‌లో అభిజీత్, అఖిల్, సొహైల్, అరియానా, హారిక‌లు ఉండ‌గా.. వీరిలో ఎవ‌రు ఈ సారి విన్న‌ర్‌గా నిలుస్తార‌న్న చ‌ర్చ హాట్ టాపిక్‌గా మారింది.

Vijay Devarakonda

అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్‌లు అంద‌రిలో స్ట్రాంగ్‌గా ఉన్న‌ అభిజీత్‌కి మ‌ద్ద‌తు రోజురోజుకు పెరుగుతోంది. ఇక సామాన్యులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా అత‌డికి త‌మ స‌పోర్ట్‌ని ఇస్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌బాబు, శ్రీకాంత్ త‌దిత‌రులు అభిజీత్‌కి మ‌ద్ద‌తును ఇవ్వ‌గా.. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక అభితో ఉన్న ఫొటోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన దేవ‌ర‌కొండ‌.. ”మై బాయ్స్.. ఎప్పుడైనా, ఎక్క‌డైనా వారికి మంచే జ‌ర‌గాలి” అని కామెంట్ పెట్టారు.

ఇక శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో అభిజిత్ ఒక హీరోగా న‌టించారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ అందులో చిన్న పాత్ర‌లో మెరిసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి వారిద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు త‌న మిత్రుడికి విజ‌య్ మ‌ద్ద‌తును తెలిపారు. ఇక విజ‌య్ స‌పోర్ట్‌తో అభి ఫ్యాన్స్ మ‌రింత సంతోషప‌డుతున్నారు. అభిజీత్‌కి ఓటు వేయండి అంటూ సోష‌ల్ మీడియాలో వారు ప్ర‌చారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version