I LOVE CM జగన్ : హీరో విశాల్

-

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు విశాల్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తమిళ సినిమాల్లో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన హీరో విశాల్‌. ఆయ‌న తాజా చిత్రం ‘లాఠీ’తో ప్రేక్ష‌కుల ముందుకు డిసెంబ‌ర్ 22న వ‌స్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం లేదని వెల్లడించిన హీరో విశాల్‌.. తాను వైసీపీ పార్టీ లో చేరడం లేదని చెప్పాడు. ఇవాళ సీఎం జగన్ ను కలువనున్న హీరో విశాల్.. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. ఐ లవ్‌ యూ సీఎం జగన్‌.. జగన్‌ అంటే నాకు ఇష్టం అని తెలిపారు విశాల్‌. నేను ఓటు వేయాల్సి వస్తే, జగన్‌ కే వేస్తానని తేల్చి చెప్పారు. నేను ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదని, కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని వివరించారు. అక్కడ ప్రతి వీధి తెలుసని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version