PRIYAMANI : షాక్ లో ప్రియమణి… పెళ్ళి చెల్లదట…!

-

టాలీవుడ్‌ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ లలో ఒకరు ప్రియమణి. యమదొంగ లాంటి సినిమాలలో చేసి ప్రియమణి మంచి తెచ్చుకున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత.. నారప్ప సినిమాతో ప్రియమణి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… తాజాగా హీరోయిన్‌ ప్రియమణి చిక్కుల్లో పడింది. ఆమె పెళ్లి విషయం వివాదస్పందగా మారింది. 2007 లో ప్రియమణి… ముస్తఫాల అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే… ప్రియమణితో జరిగిన తన భర్త ముస్తఫా రాజ్‌ పెళ్లి… అసలు చెల్లబోదని అతని మొదటి భార్య అయేషా తాజాగా ప్రకటించింది. ముస్తఫాల అధికారికంగా తనతో డైవర్స్‌ తీసుకోలేదని మొదటి భార్య అయేషా స్పష్టం చేసింది. దీనిపై అయేషా మరియు ఆమె కుటుంబ సభ్యులు కలిసి.. ప్రియమణి దంపతులపై కేసు నమోదు చేశారు. మొదటి భార్యతో ముస్తఫాల దూరంగా ఉన్నప్పటికీ..ఇంకా విడాకులు తీసుకోలేదు..కావున ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధం.

ఈ నేపథ్యంలోనే ముస్తఫా రాజ్‌పై అతని మొదటి భార్య అయేషా గృహ హింస కేసును నమోదు చేసింది. ఈ కేసుపై మేజిస్ట్రేట్‌ కోర్టు కూడా తాజాగా విచారించింది. ఈ సందర్భంగా చట్టప్రకారం ముస్తఫాల భార్య అయేషానని… ప్రియమణితో అతడి వివాహం చెల్లదు అని తెల్చేసింది కోర్టు. దీంతో హీరోయిన్‌ ప్రియమణికి కొంత చిక్కులు వచ్చి పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version