హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం..?

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు, హీరోలు.. అటు డబ్బు పరంగా ఇటు ప్రేమ పరంగా ఏదైనా ఒక విషయంలో మనస్థాపం చెందితే మాత్రం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే నాడు ఉదయ్ కిరణ్ మొదలుకొని.. నేడు సిమ్రాన్ చెల్లెల వరకు ఇలా చాలామంది మానసిక వేదనలతో మరణించిన వారే.. ఇకపోతే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని అందరి స్టార్ హీరోల సరసన నటించి మరింత అభిమానులను సొంతం చేసుకున్న సిమ్రాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె చెల్లెలు మోనాల్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈమె సిమ్రాన్ సొంత చెల్లెలు కాదు .సిమ్రాన్ తల్లి దత్తత తీసుకుంది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోనాల్ కి సినిమాలలో అవకాశాలు రావడంతో హిందీ, తమిళ్ సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ్లో సూపర్ హిట్ అయిన బద్రి సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది మోనాల్.

ఇక తెలుగులో ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె అంతగా గుర్తింపు రాలేదు. ఇక సిమ్రాన్ చెల్లెలు గానే గుర్తు పెట్టుకునేవారు ప్రేక్షకులు. ఇక ఇదే సమయంలో మోనాల్ ఒక తమిళ్ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి అతన్ని ఎంతో గాఢంగా ప్రేమించింది. ఇద్దరు కూడా చట్టాపట్టాలేసుకొని తిరిగారు . ఇక అప్పట్లో సిమ్రాన్ చెల్లెలు కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.. సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలావరకు పడక సుఖం వరకే ఉంటాయని మోనాల్ కి తెలియలేదేమో. అందుకే సంవత్సరం పాటు మోనాల్ తో తిరిగి ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత అతడు మెల్లిగా ఆమెకు దూరం అయ్యాడు. ఇక చివరికి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయనంత దూరం పెట్టేశాడు.

మోనాల్ మాత్రం అతని ప్రేమను మర్చిపోలేక మానసిక వేదనకు గురై బాధను తట్టుకోలేక చివరికి ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింది. ఇక ఇలా మానసిక వేదనకు గురై శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version