రేపు ఆముదాలవలసలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమదాలవలస రేపు 3.20 గం.లకు రానున్నారని.. 10 నిముషాల పాటు ప్రజలతో మమేకం అవుతారన్నారు. సాయంత్రం 4.15 వరకు మాత్రమే ఆమదాలవలస పట్టణంలో ఉంటారని.. సిఎం వస్తే ఆమదాలవలస లో షాప్స్ అన్ని మూసేస్తారు అని వదంతులు వస్తున్నాయి నమ్మవద్దని కోరారు.
144 సెక్షన్, కర్ఫ్యూ అని పుకార్లు నమ్మవద్దని.. మంత్రులు, అధికారులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ లు, పార్టీ ముఖ్య నేతలు వస్తారన్నారు. ఆమదాలవలసలో ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవచ్చని.. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు భయం వద్దని స్పష్టం చేశారు.
ఏ షాప్స్ క్లోజ్ చేయం.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్థానికులు పోలీసులకు సహకరించండని.. సిఎం ఉండేది గంట కాలం మాత్రమేనని తెలిపారు. అందరూ నా కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులని ఆశీర్వదించండని.. అందరూ సంతోషంగా ఉంటే నాకు ఆనందమని చెప్పారు. వదంతులు నమ్మవద్దు… పెళ్లికి వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేశామని.. పార్కింగ్ ప్లే సెస్ వద్ద నుండి పెళ్లి మండపం వరకు వృద్ధులు కోసం ప్రత్యేక మిని బస్ లు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు.