కెరీర్‌కి పెళ్లి అడ్డు కాదంటున్న హీరోయిన్లు…!

-

హీరోయిన్లకి పెళ్లైపోతే సినిమాలు తగ్గిపోతాయి, కెరీర్‌ క్లోజ్ అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ కంటిన్యూ చేస్తున్నారు. ఇంటిని కెరీర్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. మిస్ కాజల్‌ ఈ నెలాఖరున మిసెస్‌గా మారుతోంది. అక్టోబర్‌ 30న బిజినెస్‌మెన్ గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకోబోతోంది కాజల్. అయితే పెళ్లి తర్వాత కొత్త లైఫ్‌ స్టార్ట్‌ చేస్తున్నా, సినిమాలు మాత్రం ఆపనంటోంది కాజల్. కెరీర్‌ కంటిన్యూ చేస్తానని చెప్పింది. పెళ్లి తర్వాతే చిరంజీవి ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్2’ షూటింగ్స్‌లో జాయిన్‌ కాబోతోంది.

రీసెంట్‌గానే థర్డ్ యానివర్సరీ జరుపుకున్న సమంత కూడా హీరోయిన్‌గా జర్నీ చేస్తూనే ఉంది. మిసెస్‌ నాగచైతన్యగా ‘మజిలీ, ఓ బేబీ’ లాంటి సినిమాల్లో హంగామా చేసిన సామ్, నెక్ట్స్ ఒక ఎక్స్‌పరిమెంటల్‌ మూవీ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది.ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న దీపిక పదుకొణే కూడా పెళ్లి తర్వాత కెరీర్‌ కంటిన్యూ చేస్తోంది. మిసెస్‌గా మారాక కూడా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ప్లేస్‌ని కంటిన్యూ చేస్తోంది. ఇక కరీనా కపూర్ అయితే అమ్మగా ప్రమోషన్ అందుకున్నాక కూడా హీరోయిన్‌గా జర్నీ చేస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version