ప్రేమించిన వారికోసం మతాన్నే మార్చుకున్న హీరోయిన్స్.. వారి అసలు పేర్లు ఇవే..!!

-

ఎక్కడైనా సరే అమ్మాయిలు తాము ప్రేమించిన వారి కోసం ఇష్టాలను మార్చుకుంటారు.. అభిప్రాయాలను మార్చుకుంటారు.. పేర్లను మార్చుకుంటారు.. కానీ సినీ సెలబ్రిటీలు మాత్రం ప్రేమించిన వారి కోసం ఏకంగా తమ మతాన్నే మార్చుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రేమించి..తమ మతాన్ని మార్చుకొని.. తమ పేర్లను కూడా మార్చుకోవడం గమనార్హం. ఇక అలా ప్రేమించిన వారి కోసం మతాన్ని మార్చుకున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. నయనతార:లేడీ సూపర్ స్టార్ గా గుర్తింప తెచ్చుకున్న నయనతార తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో నటించి ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే నయనతార నిజానికి ఒక క్రిస్టియన్ .. క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు డయాన మరియం కురియన్. ఇక ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకోక ముందే అతడిని ప్రేమిస్తున్న సమయంలోనే ఆమె సనాతన ధర్మాన్ని స్వీకరించింది.

2. మోనికా :
ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మోనికా తండ్రి హిందూ మతస్థుడు. ఈమె తల్లి క్యాథలిక్ మతానికి చెందినవారు. కానీ ఈమె మాత్రం ఇస్లాం మతంలోకి మారింది. ఇస్లాం మత సూత్రాలు ఈమెకు ఎక్కువగా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా తన పేరును ఎంజి రహీమా గా కూడా మార్చుకుంది.

3. జ్యోతిక:జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈమె ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక ఈమె తండ్రి పంజాబీ కాగా తల్లి ముస్లిం మతానికి చెందినవారు. హిందూ ఆచారాల ప్రకారం సూపర్ స్టార్ సూర్యని వివాహం చేసుకోవడంతో ఈమె కూడా హిందూ మతానికి మారింది. ఇక ఈమె అసలు పేరు జ్యోతిక సద్నా శరవణన్.

4. ఖుష్బూ:అలనాటి క్రేజీ హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ హీరోల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. అసలు పేరు నఖత్ ఖాన్ .. ఇక ఆ తర్వాత ఈమె సుందర్ అనే హిందూ మతస్తుడిని వివాహం చేసుకోవడంతో తాను కూడా హిందూమతంలోకి మారింది. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత ఈమె తల్లిదండ్రులు ఈమెకు ఖుష్బూ అని నామకరణం చేశారు.

5. నగ్మా:నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ.. కానీ ఈమె క్రైస్తవ మతంలోకి మారి , ఆ తర్వాత 2007లో బాప్టిజం స్వీకరించింది.. ఇక ప్రస్తుతం అదే మతంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం..

Read more RELATED
Recommended to you

Exit mobile version