బిగ్ బాస్ లో ఏది పడితే అది చూపిస్తారా అని హై కోర్టు సీరియస్ అయింది. బిగ్ బాస్ షోపై వ్యాజ్యం …సీజె ధర్మాసనం ముందుంచాలన్న హైకోర్టు.. రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని పేర్కొంది. బిగ్ బాస్ షోపై దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రియాల్టీ షోలో ఏం చూపినా కళ్లు మూసుకొని ఉండలేమని.. షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారు.. అది సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించింది.
వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం… వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. సీజె బెంచ్ ముందు అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది.
జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారని తెలిపిన ప్రతివాదుల న్యాయవాది… రియాల్టీ షోల నిర్వహణకు విధివిధానాలు ఉన్నాయన్నారు. వ్యాజ్యాలపై విచారణ జరపాలని సీజే ధర్మాసనాన్ని కోరిన మాట వాస్తవమేనన్న పిటిషనర్ తరఫు న్యాయవాది… కోర్టు ముందు నిజాయితీతో వ్యవహరించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచనలు చేసింది.