సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..!

-

తెలంగాణ రాష్ట్రంలోని పాత సచివాలయం భవనాలను కూల్చేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. దాదాపు ఆరు నెలలుగా సచివాలయం కూల్చివేతపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. ఎట్టకేలకు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది.

దీంతో సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ.. కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతించింది. అలాగే ఈ విషయంలో కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version