తెలంగాణ హైకోర్టు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను ఆపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్ట్ కొట్టేసింది. దాఖలు అయిన పిటీషన్లపై రెండో రోజు విచారణ చేపట్టిన హైకోర్ట్, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత వనపర్తి, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలు సహా కరీంనగర్ కార్పొరేషన్‌లో పలు డివిజన్లలో ఎన్నికలపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది.
రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరగలేదనే ఆరోపణలై హైకోర్టు ఈ మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. దీనితో మరి కొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఎన్నికలు యధాతదంగా ముందు ప్రకటించిన తేదీకే జరగనున్నాయి. స్టే విధించిన స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నిలిపి వేయనుంది. మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించలేదని,
తొలుత రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం అలా చేయలేదని వాదించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమని తన వాదన వినిపించారు. అందువల్ల నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనందిగా ప్రకటించాలని,
సవరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరగా, స్పందించిన ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది, షెడ్యూలు ప్రకటించడానికి ముందే రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించామని, నిబంధనల మేరకే నడుచుకున్నామని తెలపగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని చెప్తూ తీర్పు ఇచ్చింది. దీనితో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి.