BREAKING : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్ట్ నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కు భూమి కేటాయించడంపై నోటీసులు జారీ చేసింది తెలంగాణ హై కోర్టు.
బంజారాహిల్స్ లో 4935 గజాలు కేటాయించారని రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విలువైన భూమిని గజం రూ.100 చొప్పన కేటాయించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు పిటీషనర్.
అయితే.. దీనిపై విచారణ చేసిన తెలం గాణ హై కో ర్టు.. నోటీసు లు జారీ చేసింది. నాలుగు వారాలలోగా కౌంటర్ వేయాలని హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అయితే.. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. గత నెనలలో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా కేసీఆర్ సర్కార్ భూమి కేటాయిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. విలువైన బంజారాహిల్స్ ఏరియాలో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా భూమి కేటాయించింది సర్కార్. దీంతో వ్యతిరేకత వచ్చింది.