ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయవాది సురేశ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారన్న సురేశ్.. దీనిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న సురేశ్.. ఈడీ దర్యాప్తు చేస్తే మూల కారకులు బయటకు వస్తారని పేర్కొన్నారు.ఓ రాజకీయ పార్టీకి పోలీసు వాహనాలు డబ్బులు తరలించారని నిందితులే ఒప్పుకున్నారని అన్నారు.

 

 

ఫోన్ ట్యాపింగ్ పై ఈడీ PMLA యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అడ్వకేట్ సురేష్ పిర్యాదులో కోరారు.కేసులో ఇప్పటివరకు అసలు నిందితులను విచారించలేదన్నారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version