అక్కినేని నాగార్జున హోస్ట్ గా చాలా విజయవంతంగా నడుస్తున్న టీవీ ప్రోగ్రాం బిగ్ బాస్. అయితే ఈ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ ఓ బ్రోతల్ హౌస్ అని సిపిఐ నారాయణ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పలువురు ఏపీ హైకోర్టులో దీనిపై పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బిగ్బాస్ షోలో ఏముందో తెలుసుకునేందుకు రెండు రోజుల ఎపిసోడ్ ను తాము చూస్తామని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని..షోలో పాల్గొనే మహిళలకు గర్భాధారణ పరీక్షలు కూడా చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు తాము ముందుగా ఎపిసోడ్ లను చూసి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఈ కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.