రాజ్యాంగాన్ని మార్చేస్తారా…? తెలంగాణా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన హైకోర్ట్

-

సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్ట్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో నేషనల్ హై వే యాక్ట్ ను ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదు అంటూ తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది. నేషనల్ హై వే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది , రాష్ట్రానికి ఏం అధికారం ఉంది అని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ విధంగా అంబులెన్స్ లను ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనుమతి తీసుకుందా అని ప్రశ్నించింది.

పాజిటివ్ వచ్చిన వారిని చాలా రాష్ట్రాల్లో అనుమతించడం లేదు అని హెల్త్ సెక్రటరీ వివరించారు. అంబులెన్స్ లో పాజిటివ్ వచ్చిన వారే ఉంటారు కాబట్టే వారిని అనుమతించడం లేదు అని తెలిపారు. ఇతర రాష్ట్రాల రోగులను ఏ విధంగా అడ్డుకుంటారని హైకోర్ట్ నిలదీసింది. అంబులెన్స్ లను ఆపొద్దని చెప్పినా ఎలా ఆపేస్తారు అంటూ ప్రశ్నించింది. రాజ్యాంగాన్ని మీరే మార్చేసుకుంటారా అని హైకోర్ట్ నిలదీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version