జగన్‌ సర్కార్‌ పై షాక్‌.. టీటీడీ బోర్డు నియామకపై హై కోర్టు సీరియస్‌ !

-

ఇటీవల జగన్‌ సర్కార్‌ నియామకం చేసిన టీటీడీ పాలక మండలిపై వివాదం కొనసాగుతూనే ఉంది. నూతన పాలక మండలి సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ… పలుగురు హై కోర్టు ను ఆశ్రయించారు. అయితే.. ఈ పిటీషన్లపై ఇవాళ విచారించిన హై కోర్టు… టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై సీరియస్ అయింది.

పాలక మండలి సభ్యులు గా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారు అంటూ జీవో సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి. భాను ప్రకాష్ పిటిషన్ పై న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్ ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అశ్విని కుమార్.

కేతన్ దేశాయి ని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ఈ సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది హై కోర్టు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారి కి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version