హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట…

-

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున ఎన్నికల నిర్వాహణను నిలిపివేసేందుకు కోర్టు సమ్మతించలేదు. దీనికి తోడు బీసీ రిజర్వేషన్ ను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీసీ జాతీయ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు చుక్కెదురైంది.

కృష్ణయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్ తగ్గింపు వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు  ఆదేశించింది. తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణలో ఎన్నికల నిర్వాహణ అనుకున్నట్లుగానే జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version