ఐఫోన్ పిచ్చి కిడ్నీ అమ్ముకునేలా చేసింది

-

Chinese youth who sold his kidney for iphone is now completely bed ridden

యాపిల్ ప్రాడక్ట్స్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అందరు యాపిల్ డివైజులకు అడిక్ట్ అయ్యేవాళ్లే. ముఖ్యంగా ఐఫోన్.. అది చేతుల్లో ఉంటే ఉండే మజాయే వేరు. యూత్ అయితే.. అమ్మాయిలను పడేయడానికి ఐఫోన్‌తో షోఆఫ్ చేస్తారు. ఐఫోన్ కొనడం కోసం ఎన్నో దారులు వెతుక్కుంటారు. కానీ.. ఈ యువకుడు వెతుక్కున్న దారి మాత్రం చాలా కొత్తది. అవును.. ఐఫోన్ కొనడం కోసం తన కిడ్నీనే అమ్మేసుకున్నాడు. పోనీ.. అంతడితో మనోడి కథ సుఖాంతం అయిందా అంటే లేదు.. మనోడి తలనొప్పి ఇంకాస్త ఎక్కువైంది. ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది అంటారు కదా అట్లాగే తయారయింది మనోడి సంగతి. కిడ్నీ అయితే అమ్ముకున్నాడు కానీ.. అది కాస్త తిరగబడి.. లోపల ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు ఆ యువకుడు. ఈ ఘటన జరిగింది 2012లో. అప్పట్లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 4 కోసమే మనోడు తన కిడ్నీని అమ్ముకున్నాడు.

చైనాకు చెందిన 17 ఏళ్ల గ్జియావో వాంగే ఈ పని చేసింది. తన స్కూల్‌లోని క్లాస్ మేట్లకు కొత్త ఐఫోన్ మోడల్ చూపించాలన్న ఆతృతతో ఎలాగైనా ఐఫోన్ కొనాలని.. తన కిడ్నీని 22000 యువాన్లకు అమ్ముకున్నాడు. అంటే.. మన కరెన్సీలో 2.24 లక్షలు అన్నమాట. కాకపోతే డాక్టర్లు మనోడికి సరిగ్గా వైద్యం చేయకపోవడంతో ఆపరేషన్ చేసిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో అసలు విషయం తన పేరెంట్స్‌కు తెలిసింది. మనోడికి వారానికి ఒకసారి డయాలసిస్ చేయించాలి. ఇప్పుడు మనోడికి 24 ఏళ్లు. ఇప్పటికీ.. ఆ యువకుడు ఆసుపత్రికే పరిమితం అయ్యాడు. తన పేరెంట్స్ ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని.. రోడ్డు మీదికి వచ్చారు. కానీ ఏం లాభం. కన్న కొడుకు గత 7 ఏళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అతడి ట్రీట్‌మెంట్‌కు లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేదు. ఇప్పటికీ వారానికి ఒకసారి డయాలిసిస్ చేయిస్తేనే అతడు బతికి బట్టకడతాడు.

ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకునేదేమిటీ అంటే.. ఒక స్మార్ట్ ఫోన్ కోసం.. అది కూడా తోటి క్లాస్ మేట్స్ ముందు హెచ్చులు కొట్టడం కోసం కిడ్నీ అమ్ముకొని ఇలా జీవితాన్నే నాశనం చేసుకున్నాడు ఆ కుర్రాడు. అది కూడా పేరెంట్స్‌కు తెలియకుండా తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు పేరెంట్స్, అతడి జీవితం రెండూ నాశనమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version