వెలగపూడి పరామర్శకు వెళ్తున్న వైసీపీ నేతలకు చుక్కెదురు

-

తుళ్ళూరు మండలం వెలగపూడిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ స్టార్ పెట్టుకునే విషయంలో రెండు ఎస్సీ వర్గాల మధ్య రెండు రోజుల నుంచి వివాదం నడుస్తోంది. రెండు వర్గాలగా విడి పోయి మాల – మాదిగ వర్గానికి చెందిన వారు రాళ్ళు రువ్వుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదకొట్టారు. అయితే ఈ ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరియమ్మ మృతి చెందింది. రోడ్డుకు పక్కన ఆర్చి విషయం లో రెండు వర్గాల మద్య వివాదం మొదలయినట్టు చెబుతున్నారు. దీంతో మరియమ్మ మృతదేహంతో వెలగపూడిలో అంబేద్కర్ విగ్రహాం వద్ద మాల సామాజిక వర్గం వారు ధర్నాకు దిగారు. 

క్రమంలో ఎంపీ నందిగం సురేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి హోం మంత్రి చేరుకోగా ఆమె సమక్షంలో ఎంపీకి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ ఆమెను చుట్టుముట్టిన బాధితులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు.  ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కి నిరసన సెగ తగిలింది. అడ్డుకున్న స్దానిక మహిళలు, ఎమ్మెల్యే పై శాపనార్దాలు పెట్టారు. మేం పార్టీ చూశాం….మీరు కులం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు సాయంతో అక్కడి నుండి ఉండవల్లి శ్రీదేవి వెళ్ళిపోయారు. ఇక వెలగపూడికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలు రాగా ఎంపీని అడ్డుకున్న బాధితులు, సురేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.  

 

Read more RELATED
Recommended to you

Exit mobile version