Breaking news: హిజాబ్ పై కర్ణాటక హైకోర్ట్ సంచలన తీర్పు… విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదు

-

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టింది. జస్టిస్ రితూరాజ్ అవస్థి నేతృత్వంలోని జస్టిస్ క్రిష్ణ దీక్షిత్, జెఎస్ ఖాజీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.  హిజాబ్ ను నిషేధించడాన్ని వ్యతిరేఖిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కోర్ట్ కొట్టేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి సంబంధించి తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది. ఇస్లాంలో హిజాబ్ ధరించాలనే నిబంధన లేదని హైకోర్ట్ పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. విద్యాసంస్థల ప్రోటోకాల్స్ ని అంగీకరించాల్సిందే అని పేర్కొంది. స్కూల్ యూనిఫాం సహేతుకమైనదని విద్యార్థి అభ్యంతరం చెప్పలేరని పేర్కొంది.

మరోవైపు కోర్ట్ తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శివమొగ, ఉడిపి, కులబురిగి జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్నాటక హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version