మా అంతర్గత వ్యవహారాల్లో కలుగచేసుకోవద్దు… హిజాబ్ వివాదంపై విదేశాలకు భారత్ సూచన

-

దేశవ్యాప్తంగా ‘ హిజాబ్’ అంశం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో ప్రారంభమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ఓ కాలేజీలో చిన్నిగా మొదలైంది హిజాబ్ వివాదం. తక్కువ రోజుల్లోనే కర్ణాటకలోని బెళగావి, కొప్పెల, చిక్ మంగళూర్, మాండ్యా జిల్లాలకు కూడా పాకింది. హిజాబ్ ను వేసుకుని తరగతులకు హాజరు అవుతామంటూ.. ఓ వర్గం వారు ఆందోళన చేస్తుంటే.. వారికి వ్యతిరేఖంగా మరో వర్గం వారు కాషాయ కండువాలతో రావడం ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్ట్ ముందర ఉంది.

ఇదిలా ఉంటే.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని విదేశాలకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది భారత్. చివరకు మైనారిటీల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోని పాకిస్తాన్ కుడా భారత్ కు నీతులు చెబుతోంది. పాక్ వ్యాఖ్యలపై కూడా భారత్ తీవ్రంగానే స్పందించింది. ఇదిలా ఉంటే.. విదేశీ మంత్రిత్వ శాఖ ఓ నోట్ను విడుదల చేసింది. కర్ణాటక హైకోర్ట్ ఈ విషయాన్ని విచారిస్తోందని. భారత రాజ్యాంగం, రాజకీయాలు ఈ విషయాన్ని పరిష్కరిస్తాయని.. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని విదేశాలకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version