ఏడువారాల నగల వెనుక ఇంత  చరిత్ర దాగి ఉందా..!!!

-

ఏడువారాల నగలు అంటే తెలియని వారు ఉండరు. వారం రోజుల్లో రోజుకో రకంగా నగలని ధరిచేవారు. ఏడువారాల నగలకి పూర్వం ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే చాలా మందికి ధర్మ సందేహం ఏమిటంటే. అసలు ఏడువారాల నగలు ఎందుకు వేసుకోవాలి. వాటిని వేసుకోవడం వలన లాభం ఏమిటి..??  వారానికో రకం చప్పున ఎందుకు వీటిని ధరించాలి..??

ఏడువారాల నగల  ప్రాముఖ్యత ఏమిటంటే. మన పూర్వీకులు గ్రహాల యొక్క అనుగ్రహం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం  ఏడువారాల నగలు ధరించేవారు. ఆదివారం మొదలు శనివారం వరకూ రోజుకో ఆభరణాన్ని ధరించే వారు. గ్రహాలకి అనుకూలంగా ఉండేలా ఈ నగలు ధరించేవారు. మరి ఏ రోజుకి ఏ ఆభరణం ధరిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం.

చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం ఈ రోజున ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకునే వారు.
మంగళవారం కుజుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజున  పగడాలతో  చేసిన నగలు పెట్టుకుంటే ఎంతో శుభం జరుగుతుందని మన పూర్వీకులు భావించేవారు.

బుధవారం రోజు బుద్ధుడికి ఇష్టమైన పచ్చల హారాలు గాజులు వేసుకుంటే ఎంతో మంచిది అలాగే

గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు, అందుకే గురువారం పుష్పరాగం తో చేసిన చెవి దిద్దులు ఉంగరాలు ధరించటం ఎంతో శుభసూచకం

శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇ ఆరోజు వజ్రాల హారాలు ముక్కుపుడకను ధరించి లక్ష్మీదేవిల అలంకరించుకుని నిండుగా ఉండాలని అంటుంటారు

శనివారం రోజు ఊ శని భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజున ఆయనకు ఇష్టమైన నా నీలమణి నగలు తగ్గించడంతోపాటు నెలలో చేసిన నగలు ముక్కుపుడక పెట్టుకోవటం ఎంతో మంచిది నవరత్నాలతో పాపిడి బిల్ల వంకీలు ఇలా ఎన్నైనా  చేయించుకోవచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version