నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నార్సింగిలోని వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ద్విచక్ర వాహానాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు పిల్లి గణేష్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుండగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..
నార్సింగ్ వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
ప్రమాదంలో బైకర్ పిల్లి గణేష్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు… pic.twitter.com/5CTzE647N7
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025