దాయాది దేశం పాకిస్తాన్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. పెషావర్లోని దారుల్ ఉలుమ్ హఖానియా మదర్సాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ సూసైడ్ బాంబర్ దూసుకొచ్చినట్లు సమాచారం.
సదరు సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో భవనం మొత్తం ధ్వంసమైంది.ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. సూసైడ్ బాంబర్ ఘటనపై పెషావర్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
https://twitter.com/greatandhranews/status/1895465817543950343