హిందీ ‘హిట్’ వచ్చేస్తోంది..సినిమా విజయంపై దిల్ రాజు ధీమా

-

సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ సూపర్ హిట్ ఫిల్మ్స్ ఇటీవల కాలంలో బాలీవుడ్ రీమేక్ అయి సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, మరో రీమేక్ అఫీషియల్ గా త్వరలో విడుదల కాబోతున్నది. ఈ సినిమా విజయంపైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేశ్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ ఫిల్మ్ ను హిందీలో సేమ్ డైరెక్టర్ తో రీమేక్ చేశారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చే నెల 15న విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు కు జోడీగా ఈ చిత్రంలో సన్యా మల్హోత్ర నటించింది.

ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, టీ సిరీస్ ప్రజెంట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో వైపున తెలుగులో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నది. ఇందులో హీరోగా అడివి శేష్ నటించాడు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కు మొత్తం ఏడు సీక్వెల్స్ ఉండబోతున్నాయని ఇటీవల నాని తెలిపాడు. అందులో ఏదో ఒక సీక్వెల్ లో తానూ హీరోగా నటించొచ్చని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version