ఆస్ట్రేలియాకు చేరుకున్న హిట్‌మ్యాన్..

-

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. తొలుత హోటల్‌కు కాకుండా వెళ్లకుండా నేరుగా పెర్త్ స్టేడియానికి వెళ్లాడు. అక్కడే ఉండి మ్యాచ్ జరుగుతున్న తీరును పరిశీలించి జట్టు సభ్యులతో సమావేశం అయినట్లు సమాచారం. దీంతో రెండో టెస్టుక హిట్ మ్యాన్ రోహిత్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం జట్టుకు పేసర్ జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు.

ఇదిలాఉండగా, తనకు కొడుకు పట్టడంతో రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో గడిపేందుకు తొలి టెస్టుకు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతని ఫ్యాన్స్ ఎంతో నిరాశకు లోనయ్యారు. రెండు టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలియడంతో ఖుషీ అవుతున్నారు. కాగా, బోర్డర్ గవాస్కార్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version