‘మీ కాళ్ళు మొక్కుతా.. మా గరీబోల్ల ఇళ్లు కూలగొడితే ఏమొస్తది సార్’ అన్న కూడా హెచ్ఎండీఏ అధికారులు వినిపించుకోలేదు. మేడ్చల్‌లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పేదల ఇళ్లను HMDA అధికారులు కూల్చివేశారు.
బుధవారం ఉదయం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డు అరుంధతి నగర్‌లో భారీ పోలీసు బందోబస్తు నడుమ 15 ఇండ్లను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏండ్ల నుంచి తాము ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ ఇండ్లు కూల్చొద్దని అడ్డుకోని మహిళలు బోరున విలపించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా, హెచ్ఎండీఏ అధికారులు ఇండ్లను కూలుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మీ కాళ్ళు మొక్కుతా.. మా గరీబోల్ల ఇళ్లు కూలగొడితే ఏమొస్తది సార్
మేడ్చల్లో ఇళ్లను కూల్చివేసిన HMDA అధికారులు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డ్ అరుంధతి నగర్ లో భారీ పోలీసు బందోబస్తు నడుమ 15 ఇండ్లను కూల్చివేసిన హెచ్ఎండీఏ అధికారులు
ఎన్నో ఏండ్ల నుంచి తాము… pic.twitter.com/JM2AA0teUE
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025