ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొద్ది రోజులుగా కాలుష్యం పెరగటం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలుష్యం కారణంగా అనారోగ్యం భారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో ఇప్పటికే రాష్ట్రం లో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. దాంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీ ఏ క్యూ ఎం) ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా దీపావళి తరవాత ఢిల్లీ లో కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోయింది. ముందే ఢిల్లీ లో కాలుష్యం ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కాలుష్యం స్థాయి మరింత పెరిగిపోయింది. మరోవైపు ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా లోని కంపెనీలన్నీ 20 నుండి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను ప్రకటించాయి. ఇలా అయినా వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం సాధారణ స్థాయికి చేరుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాయి.