రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునుగల్లో ఇంటివద్ద డ్రైనేజ్ గొడవలో హోంగార్డ్ వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, చనిపోయిన హోంగార్డు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
అయితే, వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు దారుణంగా కొట్టినట్లు బాధిత ఫ్యామిలీ ఆరోపిస్తున్నది. న్యాయం చేయాలని ఆందోళనకు దిగితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులను బండ బూతులు తిడుతూ, విచక్షణారహితంగా యాచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొట్టారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, యాచారం పీఎస్ పరిధిలో హోంగార్డు ఫ్యామిలీ నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.