హానెస్ట్ పర్సన్.. డబ్బులిచ్చేందుకు ఆఫీసుల చుట్టూ.. ఏం జరిగిందంటే?

-

ప్రజెంట్ టైమ్స్‌లో హానెస్ట్ పర్సన్స్ అరుదుగా కనిపిస్తుండటం మనం చూడొచ్చు. తమది కాని వస్తువును తమ వద్ద ఉంచుకోకుండా ఎవరిదో వారికి తిరిగి ఇచ్చే వారు చాలా అరుదనే చెప్పొచ్చు. కాగా, ఇటుంటి పరిస్థితుల్లో తనకు ఎక్కువ నష్టపరిహారం చెల్లించారంటూ, రిమేనింగ్ అమౌంట్ గవర్నమెంట్‌కు ఇచ్చేసేందుకుగాను ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. వివరాల్లోకెళితే.. ప్రకృతి వైపరిత్యాల నేపథ్యంలో పంటలు నష్టపోయే రైతుల బాధల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే, నష్టపోయిన రైతులను ప్రభుత్వం కొంత మేర చర్యలు తీసుకుంటున్నది.

farmer

నష్టపరిహారం పేరిట కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే హర్యానా రాష్ట్రానికి చెందిన సూరజ్మల్ నైన్ అనే 65 ఏళ్ల వ్యక్తికి వ్యవసాయమంటే చాలా ఇష్టం. ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ వ్యవసాయం చేయాలనే నిర్ణయించుకున్నాడు. 2014లో 2 ఎకరాల‌ పంటను వేయగా, అది ప్రకృతి వైపరిత్యం వల్ల ఎండిపోయి నష్టపోయాడు. కాగా ఈ విషయమై ఆయన అధికారులకు తెలపగా, వారు ఆయనకు పదిఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు 2015లో డబ్బులు చెల్లించారు. దాంతో ఆయన ఆశ్చర్యపోయాడు. తనకు రావాల్సింది రూ.70 వేలు కాదని, కేవ‌లం రూ.14 వేలేనని చెప్పుకొచ్చాడు. మిగతావి తీసుకోవాలని చెప్తూ ఆయన అధికారులు చుట్టూ తిరుగుతున్నాడు.

అధికారులు ఇలా ఇంకెన్ని గోల్ మాళ్లు చేస్తున్నారో అని మండిపడుతున్నారు రైతు సూరజ్మల్. ఇక ఇప్పటికీ తను డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమేనని పేర్కొంటుండటం గమనార్హం. ఈ విషయం తెలుసుకుని పలువురు సదరు రైతు నిజాయితీ పరుడని పేర్కొంటున్నారు. అయితే, అధికారుల్లోనూ కొందరు నిజాయితీపరులున్నప్పటికీ మెజారిటీ ఆఫీసర్స్ ఇలా గోల్ మాల్స్ చేసేందుకు అలవాటుపడిపోయారని పలువురి ఆరోపణ. ఇకపోతే రైతులకు నిజంగా అందాల్సిన డబ్బులను అందకుండా ఇలా చేయడం అన్యాయమేనని వాదించేవారూ ఉన్నారు. ఇప్పటికైనా ఆ రైతు నుంచి డబ్బు తీసుకుని అర్హులైన రైతులకు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. చూడాలి ఏం చేస్తోరో మరి.. ఆ రైతు ఇంకెన్నాళ్లు డబ్బులు తిరిగి ఇచ్చేందుకుగాను ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతారో..

Read more RELATED
Recommended to you

Exit mobile version