నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని మహసేన రాజేష్ పేర్కొన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓవీడియోను వదిలారు. “తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దలను సూటిగా అడుగుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు అయిన మల్ల శ్రీనివాస్ ను 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయనపై జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకరి మీద ఎవ్వరి మీద పడలేదు. అన్ని కష్టాలు పడ్డవారు పార్టీ కోసం ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు మహాసేన రాజేష్.
అలాంటి వ్యక్తిని ఇవాళ కొన్ని పరిమితులు విధించి ఎక్కడ బడితే అక్కడ కూర్చొబెడుతుంటే ఆయనను చూసి పార్టీలోకి వచ్చిన మాలోంటోళ్లకు చాలా మందికి చాలా బాధగా ఉంది. నారా లోకేష్ కష్టంతో దాదాపు 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో, వారసత్వం అనుకుంటారో.. మరో రకంగా విమర్శిస్తారో అని ఆలోచిస్తాడు. మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది నారా లోకేష్ ఏ పదవీలో ఉన్నారో తప్ప.. ఆయనపై వచ్చిన విమర్శలు కాదు” అని అన్నారు రాజేష్.
నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి
2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు.. అవమానాలు పడ్డాడు
నారా లోకేష్ పడ్డ కష్టం వల్లే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి
లోకేష్ అభిమానులుగా ఆయన్ని మూలన చూడడం మాకు నచట్లేదు – మహసేన రాజేష్
Video Credits – Mahasena Media pic.twitter.com/X5pQS6hO0G
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025