Honeymoon Destinations in India: చాలా మంది పెళ్లికి ముందే మంచి హనీమూన్ ట్రిప్ వేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్ జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే మన భారతదేశంలో ఉన్న హనీమూన్ డెస్టినేషన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హిమాలయాస్ లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. నిజంగా అక్కడికి వెళ్తే ఆ హనీమూన్ గుర్తుండిపోతుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రదేశాల గురించి చూసేద్దాం.
మనాలి:
మనాలి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. పాపులర్ హనీమూన్ డెస్టినేషన్స్ లో ఇది ఒకటి. అక్టోబర్ నుండి జూన్ మధ్యలో మనాలి చూడడానికి మరింత బాగుంటుంది. చల్లగా స్నో తో ఎంతో అద్భుతంగా ఉంటుంది. హిడింబా టెంపుల్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, రోతంగ్ పాస్ మొదలైన ప్రాంతాలని చుట్టేయవచ్చు.
కాశ్మీర్:
కాశ్మీర్ కూడా మంచి హనీమూన్ డెస్టినేషన్. కొండలు అడవులు తో ఎంతో అద్భుతంగా ఇది ఉంటుంది. బోటింగ్, ట్రెక్కింగ్, స్నోబోర్డింగ్ మొదలైనవి చూడచ్చు. చలికాలంలో ఈ ప్రదేశం మరింత బాగుంటుంది. ఇక్కడికి హనీమూన్ వెళితే గుర్తుండిపోతుంది.
ధర్మశాల:
ధర్మశాల కూడా హనీమూన్ కి పర్ఫెక్ట్ ప్లేస్. ధర్మశాల సంవత్సరంలో ఎప్పుడైనా చూడొచ్చు ముఖ్యంగా వేసవిలో బాగుంటుంది. ఇక్కడ కూడా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ధర్మశాల వెళ్తే ఇవన్నీ చుట్టేయవచ్చు.
ఉదయపూర్:
ఉదయపూర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి కావాలంటే అక్కడికి కూడా మీరు వెళ్లొచ్చు.
అండమాన్:
ఎక్కువమంది హనీమూన్ కోసం వెళ్తూ ఉంటారు అక్కడ ఉండే సముద్రతీరాలు, క్యాండిల్ లైట్ డిన్నర్ ఇవన్నీ కూడా మంచి జ్ఞాపకంలా మీకు మిగిలిపోతాయి. అలానే కూర్గ్, డార్జిలింగ్, మున్నార్, ఊటీ కూడా హనీమూన్ కి మంచి ప్రదేశాలు.