తుమ్మల వారసుడు పోలిటికల్ ఎంట్రీ ఫిక్స్…సీటు అదేనా…

-

రాజకీయాల్లోకి సీనియర్ నాయకులు తమ వారసులని తీసుకురావడం కొత్తేమీ కాదు. తమ లాగానే తమ వారసులు కూడా రాజకీయాల్లో రాణించాలని ప్రతి సీనియర్ నాయకుడు కోరుకుంటారు. అలాగే వారసులు సైతం తమ తండ్రుల వెంటే రాజకీయాల్లోకి రావడానికి చూస్తారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారసత్వ రాజకీయం ఎక్కువ నడుస్తుందనే సంగతి తెలిసిందే. దాదాపు ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలనే చూస్తారు.

tummala nageswara rao

అలాగే తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సైతం తన వారసుడుని రాజకీయాల్లోకి దించడానికి సిద్ధమవుతున్నారు. తుమ్మల తనయుడు యుగంధర్ పోలిటికల్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడుగా ఉన్న తుమ్మల…టి‌డి‌పిలో అనేక ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత టి‌ఆర్‌ఎస్‌లోకి వచ్చి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అలాగే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.

ఇక 2016 పాలేరు ఉపఎన్నికలో టి‌ఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలయ్యారు. పైగా తుమ్మల మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టి‌ఆర్‌ఎస్‌లోకి వచ్చారు. దీంతో అప్పటినుంచి తుమ్మల సైలెంట్‌గా ఉంటున్నారు. ఇదే సమయంలో తుమ్మల తనయుడు యుగంధర్, పాలేరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

కార్యకర్తలని, అనుచరులని కలుస్తూ, త్వరలోనే కే‌సి‌ఆర్ ఆశీర్వాదంతో తమకు మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు. అంటే తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తన తండ్రి కంటే ఎక్కువగానే పాలేరుని అభివృద్ధి చేస్తానని అంటున్నారు. అంటే తుమ్మల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతుంటే, ఆయన వారసుడు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్ఎస్ తరుపున పాలేరులో పోటీ చేయడానికి యుగంధర్ సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది.  కానీ పాలేరు టి‌ఆర్‌ఎస్ టికెట్ తనదే అని సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ చెప్పుకుంటున్నారు. మరి టి‌ఆర్‌ఎస్ అధిష్టానం తుమ్మల వారసుడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version