సాదారణంగా కూరగాయల ధరలు ఎంత ఉంటాయి.. 50 లేదా 100 ఇంకా ఎక్కువ అంటే 500 ల లోపు మాత్రమే ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి..మాహా అయితే నాన్ వెజ్ ధరల రేటు పలకవు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఒక కూరగాయ ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే…ఈ కాయగూరని కొనాలంటే.. ఒక కిలోకి సుమారు రూ.లక్ష రూపాయాల పైనే వెచ్చించాల్సిందే. వాస్తవానికి ఇంత ఖరీదైన కాయగూరలు గురించి ఇప్పటి వరకు ఎవరు విని ఉండే అవకాశం లేదు.
ఇంత ధర పలికే కాయగూర సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనేందుకు ఆలోచిస్తాడు. ఈ కాయ ధర అంత పలకడానికి గల కారణం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఈ కాయగూర పేరు “హాప్ షూట్స్”. ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని మనదేశంలో బీహార్ లోని ఓ రైతు పండిస్తున్నారు..వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. దాంతో ఆ రైతు ఒక్క ఏడాది లోనే మిలినియర్ అయ్యాడు..