ఆస్పత్రికి పిలిచి బాలికపై ప్యూన్ అత్యాచారం

-

దిల్లీ షాహదారా జిల్లాలోని ఓ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలికపై అక్కడ పని చేస్తున్న దీపక్​ అనే ప్యూన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​కు చెందిన దీపక్​ దిల్లీలోని షాహదారాలోని ఓ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని ఓ రోజు ఏదో కారణం చెప్పి బాలికను ఆస్పత్రికి పిలిపించాడు.

అతని మాటలు విని బాలిక ఆస్పత్రికి వెళ్లగా ఓ రూంకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన సోదరికి చెప్పగా ఆమె తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో వారు దీపక్​పై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు..సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version