హాస్టల్ వార్డెన్ తాగొచ్చి అన్నం సరిగా పెట్టడం లేదు.. విద్యార్థుల ఆవేదన

-

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హాస్టల్ వార్డెన్లు చేసే తప్పులకు విద్యార్థులు బలవుతున్నారు. కొందరు వారితోనే పనిచేయిస్తుంటే.. మరికొందరు ఏకంగా నాసిరకంగా భోజనం పెడుతూ వారు అనారోగ్యాల పాలవ్వడానికి కారణం అవుతున్నారు.

తాజాగా మరో వార్డెన్ ఏకంగా తాగి వచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఏకంగా విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.వార్డెన్ తాగి వచ్చి ఇబ్బంది పెట్టడంతో పాటు భోజనం సక్రమంగా పెట్టడం లేదని విద్యార్థుల ధర్నాకు దిగారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కాలేజీ ఎస్సీ హాస్టల్‌లో వెలుగుచూసింది. వార్డెన్ శ్రీశైలం రోజు తాగి వచ్చి అసభ్యకరంగా తిడుతున్నాడని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ విషయంలో మెనూ అసలు పాటించట్లేదని నిరసిస్తూ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news