ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్, డీజీపీ. కోర్టులు, విద్యా సంస్థలు ఆన్ లైన్ లో.నిర్వహించాలని అటు పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనలపై 907 కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు.
సమయానికి మించి వేడుకలు నిర్వహించినందుకు 263 కేసులు నమోదు చేసామని.. పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని… గత నెల 24 నుంచి ఈ నెల 2 వరకు 16,430 మందికి జరిమానా వేసినట్లు డీజీపీ వివరించారు. జూన్ 20 నుంచి డిసెంబరు23 వరకు 5,10,837 మందికి జరిమానా విధించామని.. ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడం లేదన్నారు డీజీపీ. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు డీజీపీ. ఇక కరోనా పరిస్థితులపై విచారణ ఈ నెల 7కి వాయిదా వేసింది హై కోర్టు.