ఫ్యాక్ట్ చెక్: ఉచితంగా ఒమిక్రాన్‌ నిర్ధారణ పరీక్ష చేస్తామంటూ వచ్చిన మెసేజ్లని నమ్మొచ్చా..?

-

ఒమీక్రాన్ ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంత మంది మాత్రం దీనిని ఆసరాగా తీసుకుని ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ని గుర్తించడానికి ఉచిత నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ మెయిల్స్ పంపుతున్నారు. వీటిని కనుక నమ్మరు అంటే మోసపోవాల్సి వస్తుంది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఎంత దూరంగా ఈ ఫేక్ వార్తలు కి ఉంటే అంత మంచిది. లేదంటే అనవసరంగా మీరు నష్టపోతారు. తాజాగా వచ్చిన వార్త గురించి చూస్తే… ఒమీక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఉచిత నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ మెయిల్స్ పంపి మోసం చేస్తున్నారు.

అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోం శాఖ సైబర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగం. ఒక ప్రకటన విడుదల చేసి దీనిలో ఎలాంటి నిజం లేదని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చాలా మంది గత కొన్ని రోజుల నుంచి ఒమీక్రాన్ పేరుతో మోసాలు చేస్తున్నారని ఈ కొత్త వేరియంట్ పై వస్తున్న మోసాల్ని నమ్మకండి అని అంటున్నారు.

యూఆర్ఎల్ లింక్ వంటివి కూడా షేర్ చేస్తున్నారు. నకిలీ లింక్ ని నమ్మి షేర్ చేశారంటే నష్టపోతూ ఉంటారు. సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు చాలా మంది. ఒకవేళ కనుక ఈ తరహా మోసాలు, నేరాలు కనబడ్డాయంటే cybercrime.gov.in కు సమాచారం అందిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version