మైనర్లకు పబ్బులో అనుమతి ఎలా ఇచ్చారు?: భట్టి విక్రమార్క

-

మైనర్లకు పబ్బులు అనుమతి ఎలా ఇచ్చారు.? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ బాగోతం పై స్పందించిన ఆయన.. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్ పై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటివారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుపడ్డారు. పబ్బుల పై నియంత్రణ ఉండదా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టి.

Batti

అధికార పార్టీ సొంత వాళ్లకే పబ్బులు అనుమతి ఇవ్వడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో పబ్బులు నియంత్రణ లేకుండా పోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వానికి భయపడి నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్ మారిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version