ఎన్టీఆర్ నిజంగానే ఎన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నాడా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు . అయితే ఇందులో కొంతమంది మాత్రమే స్టార్ ఇమేజెస్ ను కైవసం చేసుకుంటారు అని చెప్పవచ్చు. అలా ఇమేజ్ ను సంపాదించడం వెనక వారు ఎంతో కృషి, పట్టుదల ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో సక్సెస్ కావాలన్నా.. ఫెయిల్ కావాలన్నా కచ్చితంగా ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందని టాక్ బాగా వినిపిస్తోంది. మరి కొంతమంది విషయంలో మాత్రం తన సొంత కుటుంబ సభ్యులు తమకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి సంఘటన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చోటు చేసుకున్నట్లు గా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

ఎన్టీఆర్ చిన్న వయస్సు నుంచి చాలా కష్టపడుతూ ఎటువంటి సహాయం లేకపోయినా ఇండస్ట్రీలో హీరోగా మారారు. ఎన్టీఆర్ పేరుకు నందమూరి తారక రామారావు మనవడు అయినా కానీ.. గతంలో తన కుటుంబం నుంచి తనకు ఎటువంటి ఆదరణ లభించలేదు అందుకు కారణం హరికృష్ణ రెండవ భార్య కొడుకు అన్నట్లుగా సమాచారం. ఆ తరువాత చాలా కాలం ఇబ్బంది పడుతున్న కొద్ది ఎన్టీఆర్ ను అద్దం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ ని చేరదీశారు అట. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మరణించిన తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకునేవారు లేరట.

ఒకవైపు నటుడుగా రాణించాలని పట్టుదల ఉండడమే కాకుండా మరొకవైపు నందమూరి ఫ్యామిలీకి బాగా దగ్గర అవ్వాలనే ఆశ మనసులో పెట్టుకొని కష్టపడ్డాడు ఎన్టీఆర్. ఇక తన తల్లిని ఎంత మంది అవమానించినా కూడా ఏనాడు కూడా ఎమోషనల్గా బయటపడలేదు. అంతేకాకుండా ఏ ఒక్కరితో కూడా విభేదాలు పెట్టుకోకుండా కేవలం నటనతో డైలాగులతో సినిమాలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలుగు ప్రేక్షకులు అభిమానుల గుండెల్లో నిలిచారు. ఇక గతంలో కూడా బాలకృష్ణ కూతురు నిశ్చితార్థం సమయంలో ఎన్టీఆర్ ను అవమానించినట్లు గా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇలా ఎన్నో సందర్భాలలో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను అవమానించినట్లు సమాచారం. అని ఇప్పుడు ఎవరైతే వద్దు అనుకుంటున్నారు వారే ఎన్టీఆర్ మావాడు అనిపించుకున్నాడు .దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఎంతలా కష్టపడ్డాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version