సీఏఏ కింద పౌరసత్వం కోసం ఇప్పటివరకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారంటే..?

-

పౌరసత్వ సవరణ చట్టం అమలైన నాలుగు నెలల కాలంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు. సవరించిన చట్టం ప్రకారం 50 లక్షల మంది అక్రమ వలసదారులు పౌరసత్వం పొందవచ్చని భావించాం కాని సీఏఏ వ్యతిరేక నిరసనకారులు ప్రజలను ఎలా భయపెట్టడానికి ప్రయత్నించారో ఈ దరఖాస్తులే సాక్ష్యమని ఆయన అన్నారు. ‘సీఏఏ కింద పౌరసత్వం కోసం 8 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా ఇద్దరు మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చారని ‘ హిమంత బిశ్వ శర్మ విలేకరుల సమావేశంలో చెప్పారు.

2015 కంటే ముందు ఇండియాకు వచ్చిన ఎవరైనా సీఏఏ ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మొదటి హక్కు ఉంటుంది. చేసుకోకపోతే వారిపై కేసు నమోదవుతుంది అని తెలిపారు.కాబట్టి ఇది చట్టబద్ధమైన సూచనగా భావించాలి అని పేర్కొన్నారు. . అలాగే, 2015 తర్వాత ఎవరు వచ్చినా వారిని బహిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version