అందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరాను… క్లారిటీ ఇచ్చిన పటాన్ చెరు ఎమ్మెల్యే

-

ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది.గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకున్నారు.శనివారం జాయినింగ్ పై రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి వెళ్లిపోయిన మహిపాల్ రెడ్డి.. ఇవాళ (సోమవారం) ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు.ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుండి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version