ఎంత తాగావు బ్రో.. ఊదితే 550 పాయింట్స్ వచ్చాయంటే మాములోడివి కాదు!

-

హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.ఇక మందుబాబులైతే బాగా చుక్కేసి చిందులు వేసినట్లు తెలుస్తోంది.ఐటీ కారిడార్‌లో మాత్రం ఆడా,మగా అనే తేడా లేకుండా ఫుల్లుగా మద్యం సేవించి రోడ్లపై విచ్చలవిడిగా సంచరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ముందుగా హెచ్చరించినట్లుగానే పోలీసులు సిటీ వ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.

అందులో ఓ మందుబాబును టెస్టు చేయగా ఏకంగా 550 పాయింట్లు వచ్చాయి.దీంతో పోలీసులే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే అతన్ని బైక్ సీజ్ చేసి రిసిప్ట్ ఇచ్చి పోలీసులు పంపించి వేసినట్లు సమాచారం. ఇలా నిన్న రాత్రి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో చాలా మంది పట్టుబడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news