కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా 13.50 లక్షల మందికి వ్యాప్తి చెందింది. దాదాపుగా 75 వేల మంది కరోనా వల్ల చనిపోయారు. అయినప్పటికీ ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. అనేక దేశాల్లో నిత్యం వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కరెన్సీ నోట్ల వల్ల కూడా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని గతంలో పలువురు సైంటిస్టులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వైరస్ ఒక్కసారి ఆ నోట్లపై చేరితే.. అది వాటిపై ఎన్ని రోజుల వరకు ఉంటుందో.. సైంటిస్టులు తాజాగా అధ్యయనం చేసి తేల్చారు.
కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ 4 నుంచి 5 రోజుల పాటు బతికి ఉంటుందని.. అలాగే కాయిన్లపై 3 రోజుల వరకు ఆ వైరస్ బతికే ఉంటుందని.. పలువురు జర్మనీ సైంటిస్టులు తాజాగా అధ్యయనం చేసి చెబుతున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారంటున్నారు. కాగా ఈ వైరస్ ప్లాస్టిక్‌పై 9 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుందని వారంటున్నారు.
అయితే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ వైరస్ ఆయా వస్తువులపై బతికే ఉండే కాలం మారుతుందని సైంటిస్టులు అంటున్నారు. వేడి వాతావరణ ఉంటే ఈ వైరస్ ఎక్కువ రోజులు బతికి ఉండదని చెబుతున్నారు.