రెండు రూపాయలతో రూ.5 లక్షలు సంపాదించొచ్చట.. ఎలాగంటే?

-

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి అయితే ఇంకా దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు నగరాల నుంచి ఇండ్ల బాట పట్టారు. కాగా సొంతంగా ఏదైనా ఒక పని చేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.. రెండు రూపాయాలతో మీరు ఐదు లక్షల రూపాయలు సంపాదించొచ్చు. అదేంటీ..రెండు రూపాలయతో లక్షల రూపాయలు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. అవునండీ.. మీరు చదివింది నిజమే.. రూ.2తో ఐదు లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సంగతి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఏదైనా వస్తువు పురాతన కాలంది అయితే మార్కెట్‌లో దానికి చాలా డిమాండ్ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే జాబితాలో రెండు రూపాయల కాయిన్ చేరిపోయింది. ఈ కాయిన్స్‌ను మార్కెట్‌లో పెట్టి అమ్మడం ద్వారా డబ్బులు ఎక్కువ మొత్తంలో లభిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాల నుంచి రెండు రూపాయల కాయిన్స్‌ను ఆర్బీఐ ముద్రించడం లేదు. దాంతో ఉన్న రెండు రూపాయల కాయిన్స్ మాత్రమే చలామణిలో ఉంటున్నాయి. అయితే, ఈ రెండు రూపాయల కాయిన్స్ 1994, 1995,1997, 2000 సిరీస్‌వి మాత్రమే అయి ఉండాలి.

అలాంటి రెండు రూపాయల కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు రూ.ఐదు లక్షలు సంపాదించొచ్చు. ఇలాంటి అరుదైన కాయిన్స్‌కు కనుక మీరు ఓనర్ అయితే వెంటనే క్విక్కర్‌లో రిజిస్టర్ అయి ఆన్ లైన్‌లో అమ్మేయండంతే..ఇందుకుగాను మీ అడ్రస్, ఫోనె నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే ముందర రెండు రుపాయల కాయిన్ ఫొటోను తీసి పెట్టాల్సి ఉంటుంది. అంతే ఇక..ఒకవేళ కస్టమర్‌కు నచ్చినట్లయితే మిమ్మల్సీ కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటాడు. ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి చర్చించొచ్చు. అయితే, 1982వ సంవత్సరంలో రెండు రూపాయల కాయిన్‌ను మింట్ చేసింది ఆర్‌బీఐ. క్యూప్రో-నికెల్ అనే మెటల్‌తో ఈ కాయిన్‌ను ముద్రించారు. మొత్తంగా మార్కెట్‌లో రెండు రూపాయల కాయిన్‌కు కూడా డిమాండ్ ఉండటాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version