ఈత ను ఈజీగా నేర్చుకోవటం ఎలా? ఈ టిప్స్ తో సాధ్యమవుతుందట..!

-

ఈతకొట్టటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అది ఒక సరదా అంతే. పల్లెటూర్లలో యువత కాళీగా ఉండే చేసే మొదటిపని వెళ్లి సరదాగా చెరువుల్లోనో, బావిలోనే ఈతకొట్టడమే. కాని కొందరికి ఇష్టం ఉన్నా నీళ్ల భయమో లేక సరైన గైడెన్స్ లేకనో ట్రైచేసి ఉండరు. మన దేశంలో యువతలో సగం మందికి ఈతరాదని ఓ సర్వేలో తేలింది. కొన్ని టిప్స్ ద్వారా ఈతను ఈజీగా నేర్చుకోవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

15 ఏళ్లలోపే ఈతను నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తుంది.. వయసు పెరిగాక ఈత నేర్చుకుంటే రాదు అని చాలామంది అంటుంటారు. కానీ అది తప్పు. ఈత నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే చాలు కచ్చితంగా నేర్చుకోవచ్చు. ఈతకొట్టటం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. అదేంటంటే..నీటి సాంద్రత కన్నా మనిషి సాంద్రత తక్కవగా ఉంటుంది. దాంతో మనం నీటిపై తేలియాడుతూ ఈతకొడతాం. అయితే ఎప్పుడైతే ఈతకొట్టే వ్యక్తి నీరు తాగుతాడో.. నీటి సాంద్రతకు సమానంగా మనిషి సాంద్రత ఉంటుంది. దాంతో మునిగిపోతాడు. అందుకే ఈతకొట్టే వాళ్లు కచ్చితంగా నోరు, ముక్కు నీటికి పై భాగంలోనే ఉంచుతారు. నేర్చుకునే వాళ్లు కూడా తమ నోరు, ముక్కు నీటికి పై భాగంలోనే ఉండే విధంగా చూసుకోవాలి. ఇదే అసలైన ట్రిక్. అప్పుడే నీటిపై శరీరం తేలియాడుతూ ఉంటుంది.

ఈత నేర్చుకోవాలి అనుకునేవాళ్లకి మొదట భయం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. నీటిని మింగకూడదు అసలు. చాలామంది ఈతకొట్టే సమయంలో భయంతోనే నీటిని మింగుతారు. అలా చేస్తే మునిగిపోతారు. భయపడకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నీటిలో 30 నుంచి 60 డిగ్రీల మధ్యలో ఒక కోణం ఏర్పడేలా ఉండి ఈత కొట్టాలి. ఆ సమయంలోనూ నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా చూసుకోవాలి.

ఆ తరువాత వెనుక వైపు కాళ్లను ఆడించాలి. ముందు నుంచి చేతులతో నీటిని మన పొట్ట కిందకు వచ్చేలా తెచ్చుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే శరీరం బ్యాలెన్స్ అవుతుంది. దీంతో నీటిలో తేలుతారు. అయితే ఇలా చేయాలంటే శరీరం మొత్తం కదలాల్సి ఉంటుంది. కనుక మొదటిసారి ఈత కొట్టే వారికి బాగా శ్రమ అనిపించినట్లు అవుతుంది. కానీ నిరంతరం సాధన చేస్తే తేలికవుతుంది.

మీరెప్పుడైనా గమనించారా… జంతువులు, పశువులు కూడా నీటి పై భాగంలోనే వాటి ముక్కు, నోటిని ఉంచుతాయి. ఈత వచ్చిఉండటం ప్రతిమనిషికి చాలా అవసరం. నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెడుకొలస్ట్రాల్ కరుగుతుంది. దానివల్ల బరువుకూడా తగ్గవచ్చు. హాయిగా ఈతకొడుతుంటే మీ శరీరం, మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. స్విమ్మింగ్ వల్ల శరీరం మొత్తం కలుగుతుంది దాంతో శరీరం మొత్తానికి వ్యయామం అవుతంది.

అంతేకాదు..స్విమ్మింగ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. సాధారణ వారితో పోలిస్తే స్మిమ్మింగ్ వచ్చిన వారిలో గుండెపోటు సమస్య తక్కువ. బీపీని తగ్గించి ..బ్లడ్ ఘగర్ ని నియంత్రించటంలో కూడా స్మిమ్మింగ్ సహాయపడుతుందట. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు లాభాలు ఉన్నాయి స్మిమ్మింగ్ వల్ల. ఇప్పటికైనా మీ మనసులో ఓ మూలనపడేసిని స్మిమ్మింగ్ కోరికను బయటకు తీసి నేర్చుకోవటం ప్రారంభించండి. అయితే నేర్చుకునే దశలోనే మనం పెద్ద చెరువులు, కొలనులు, బావుల్లో ప్రాక్టీస్ చేయటం మంచింది కాదు. మొదట పూల్స్ లో చేస్తే ఆ తర్వాత మెల్లిగా చిన్నచిన్న కొలనులో చేయటం ఆ తర్వాత నీరు లోతు ఎక్కువగా ఉన్న వాటిల్లో చేయటం చేయాలి. ఒకేసారి లోతు ఎక్కువగా ఉన్నవాటిల్లో చేస్తే ప్రాణాలకే ప్రమాదం..మనం ఎన్ని చూసి ఉంటాం..ప్రాణాలు తీసిన ఈత సరదా లాంటి వార్తలు. కాబట్టి సరైనా జాగ్రత్తలతో ముందుకెళ్లాలని సూచన.

Read more RELATED
Recommended to you

Exit mobile version