సండే స్పెషల్ ; ‘మష్రూమ్స్ విత్ చికెన్ కర్రీ’ ఎలా చేసుకోవాలి అంటే …!

-

ఆదివారం అంటే మసాలా ఘుమఘుమలు లేనిదే కొందరికి నచ్చదు. అందుకే మాంసాహార ప్రియుల కోసం సరి కొత్త రుచులను ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, ఇలా ఎప్పుడు రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా మష్రూమ్స్ చికెన్ ట్రై చేయండి.

మష్రూమ్స్ చికెన్ కి కావలసిన పదార్థాలు: ¼ కిలో చికెన్, 150 గ్రాముల మష్రూమ్స్,  ఉడికించిన చిక్కుళ్ళు, ½ నెయ్యి, కట్ చేసిన ఉల్లి ఒక కప్పు , ½ కప్పు క్యాప్సికం ముక్కలు, సోయా సాస్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ కొద్దిగా, కారం, పసుపు,కొత్తిమీర

తయారీ విధానం: ముందుగా చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి చికెన్ ని నీరు పోసి ఉడికించాలి. ఉడికిన తరువాత ఆ నీళ్ళను చికెన్ స్టాక్ అంటారు. దీనిని జాగ్రత్త చేయాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించిన తరువాత ఉడికించిన చికెన్, క్యాప్సికం ముక్కలు, మష్రూమ్స్, చిక్కుడు గింజలు వేసి 5 నిమిషాలు మగ్గించాలి. కొంచెం చికెన్ స్టాక్ లో కార్న్ ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని చికెన్ మిశ్రమంలో కలపాలి. దీనికి సోయా సాస్ కూడా మిక్స్ చేసి బండిలో సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించాలి. గ్రేవీ చిక్కగా అయిన తరువాత కొత్తిమీర వేసి దించాలి.అంతే మష్రూమ్స్ విత్ చికెన్ కర్రీ రెడీ.

పోషక విలువలు: ప్రోటిన్స్ 31.09 గ్రా, కార్బోహైడ్రేట్స్3.26 గ్రా, పైబర్ 1.0 గ్రా, కొవ్వు 1.34 గ్రా, కేలరీస్ 22

Read more RELATED
Recommended to you

Exit mobile version