ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలు ఎలా ఆఫ్ చెయ్యాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా కి అలవాటు పడిపోయారు. ఫోన్ లో ఎవరికి నచ్చిన యాప్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. పైగా ఎక్కువ సమయం ఫోన్ తో గడుపుతున్నారు. చాలా మందికి కామన్ గా ఉండే వాటిలో ట్విట్టర్ కూడా ఒకటి. వాట్సాప్ ను కూడా ఎక్కువ మంది వాడతారు.

twitter

వాట్సాప్ ద్వారా సందేశాలు షేర్ చేసుకోవడం సులభంగా ఉంటుంది. అలానే ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ని కూడా చాలా మంది వాడుతున్నారు. ట్విట్టర్ లో ట్వీట్స్ ని మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండొచ్చు. పైగా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం కానీ నటీ నటుల అప్డేట్స్ ని కానీ తెలుసుకోవడానికి ట్విట్టర్ బాగా అనుకూలంగా ఉంటుంది.

అయితే ట్విట్టర్ లో ఆటో ప్లే వీడియోలు వస్తూ ఉంటాయి. దీనిని ఎలా ఆఫ్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ట్విట్టర్లో ఆటో ప్లే వీడియోలని ఆఫ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే ఆటో ప్లే వీడియోలు ఆగిపోతాయి. ఆటోమేటికల్లీ వీడియో ప్లే ఫీచర్‌ వలన మంచి కంటెంట్ వస్తే మనకేం నష్టం లేదు. కానీ అన్‌వాంటెడ్‌ కంటెంట్‌తోనే ఇబ్బందంతా. ఇక ఇలా ఆఫ్ చెయ్యాలి అనేది చూస్తే..

  • మొబైల్ లో ట్విట్టర్ ని ఓపెన్ చెయ్యండి.
  • నెక్స్ట్ ప్రొఫైల్‌ ఐకాన్‌–ట్యాప్‌ చెయ్యండి.
  • ఇప్పుడు సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ డాటా యూసేజ్‌ను సెలెక్ట్‌ చేయండి.
  • మీరు నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, డిస్‌ప్లే అండ్‌ లాంగ్వేజెస్‌లోకి వెళ్లాలి.
  • అక్కడ ‘ఆటోప్లే సెట్టింగ్స్‌’లో ఆటోప్లే వీడియోను డిజేబుల్‌ చేయాలి అంతే.
  • ఇలా ఈజీగా ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలు ఆఫ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version