ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. అదే నోవా 10 ఎస్ఈని. కంపెనీ ఈ ఫోన్‌ను దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది. 10 సిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
హువావే నోవా 10 ఎస్ఈ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఇది కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. హువావే నోవా 10 సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఇదే కానుంది. హువావే నోవా 10 ధర 2,699 యువాన్లు కాగా (సుమారు రూ.31,000), నోవా 10 ప్రో ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.42,000) నిర్ణయించారు. ఈ ఫోన్లు కూడా ఈ సంవత్సరమే లాంచ్ అయ్యాయి.
హువావే నోవా 10 ఎస్ఈ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పంచ్ హోల్ స్లాట్‌ను మధ్యలో అందించారు.
దీని ప్రాసెసర్ వివరాలు మాత్రం తెలియరాలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఇందులో ఉంది.
8 జీబీ ర్యామ్‌ను అందించారు.
ఇందులో 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 184 గ్రాములుగా ఉంది
కెమెరా క్వాలిటీ..
హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
హువావే నోవా 10 సిరీస్‌లో ఇది మూడో ఫోన్. ఈ సిరీస్‌లో నోవా 10, నోవా 10 ప్రో ఇప్పటికే లాంచ్ అయ్యాయి. త్వరలో గ్లోబల్ మార్కెట్లలో కూడా ఇవి ఎంట్రీ ఇవ్వనున్నాయి.